Sunday, May 5, 2024

Chess | సింగపూర్‌ చెస్‌ చాంపియన్‌షిప్స్ భారత్‌కు పతకాల పంట

ప్రతిష్టాత్మక సింగపూర్‌ చెస్‌ చాంపియన్‌షిప్స్‌లో భారత క్రీడాకారులు అద్భుతంగా రాణించారు. స్వర్ణ, వెండి పతకాలు సాధించారు. 14 దేశాలకు చెందిన 600 మంది క్రీడాకారులు ఈ చెస్‌ టోర్నీలో పాల్గొన్నారు. అండర్‌-8 కేటగిరీలో భారత చిచ్చురపిడుగు అహాన్‌ కటరుక ఏడు గేమ్స్‌లు ఆడి ఏడింట విజయం సాధించి గోల్డ్‌ పతకం కైవసం చేసుకున్నాడు.

మరో చిన్నారి నోవ జుయల్‌ 7 మ్యాచ్‌ల్లో ఆరు గెలిచి సిల్వర్‌ పతకం చేజిక్కించుకుంది. అండర్‌-12 కేటగిరిలో అర్షిత గుట్టుల రజత పతకంతో సరిపెట్టుకుంది. అనన్య ఖడెల్వాల్‌, అడ్వయేట్‌ అగర్వాల్‌ తదితరులు పతకాలు సాధించారు. సింగపూర్‌ చెస్‌ చాంపియన్‌షిప్స్‌లో భారత క్రీడాకారులు అత్యధిక పతకాలు చేజిక్కించుకోవడం ఇదే ప్రప్రథమం.

Advertisement

తాజా వార్తలు

Advertisement