Thursday, May 2, 2024

అఖండ తో ఆడబోతున్న…రత్తాలు?

హీరోయిన్ లక్ష్మీరాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. అయితే హీరోయిన్ గా మొదట ఎంట్రీ ఇచ్చినప్పటికీ అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆ తరువాత ఖైదీ 150 సినిమాలో రత్తాలు రత్తాలు అంటూ ఐటెం సాంగ్ తో అదరగొట్టింది ఈ అమ్మడు. అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న అఖండ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో అలరించబోతోందట.

ఇక ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ ను కంప్లీట్ చేసిన చిత్ర యూనిట్ తన నెక్స్ట్ షెడ్యూల్ బాలయ్య లక్ష్మీరాయ్ లతో ఓ స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇక గతంలో బాలయ్యతో లక్ష్మీరాయ్ అధినాయకుడు సినిమాలో నటించింది. ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక అఖండ లో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్స్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement