Friday, April 26, 2024

వాళ్ల జోడీ బాగుంది క‌దా..? కేఎల్ రాహుల్‌తో అతియా రిలేష‌న్‌షిప్‌పై సునీల్ శెట్టి రియాక్ష‌న్..

టీమ్ ఇండియా యంగ్ క్రికెట‌ర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ న‌టి అతియా శెట్టి రిలేష‌న్‌షిప్‌ పై ఎప్పుడు ఏదో వార్త వస్తూనే ఉంది. అయితే దీనిపై తాజగా అతియా తండ్రి బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి స్పందించాడు. ముఖ్యంగా అతియా కేఎల్ రాహుల్ తో పాటు ఇంగ్లాండులో ఉందని..తనతో రిలేషన్ షిప్ లో భాగంగానే అక్కడ ఉందది రాహుల్ ఫ్యాన్స్ అతియా ఫ్యాన్స్ అంచనాలు కడుతున్నారు…అయితే దీనిపై స్పందిచిన సునీల్ శెట్టి..అతియా ఇంగ్లండ్‌లో ఉన్న మాట నిజ‌మే కానీ.. ఆమె త‌న సోద‌రుడు అహాన్‌తో క‌లిసి వెళ్లింద‌ని ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పాడు. ఇద్ద‌రూ హాలీడే కోసం యూకే వెళ్లార‌ని, కావాలంటే వాళ్ల‌నే అడిగి తెలుసుకోండ‌ని సునీల్ అన్నాడు. ఇక రాహుల్‌, అతియా ఓ ఐవేర్ బ్రాండ్‌కు అంబాసిడ‌ర్లు కావ‌డం, ఇద్ద‌రూ క‌లిసి ఆ బ్రాండ్‌ను ప్ర‌మోట్ చేయ‌డంపైనా అత‌డు స్పందించాడు. వాళ్ల‌నే అడ‌గండి. యాడ్ విష‌యానికి వ‌స్తే వాళ్లిద్ద‌రూ చాలా బాగా క‌నిపిస్తున్నారు. వాళ్ల జోడీ బాగుంది క‌దా? అని సునీల్ అన‌డం విశేషం. గ‌తేడాది కూడా కేఎల్ రాహుల్‌పై సునీల్ శెట్టి ప్ర‌శంస‌లు కురిపించాడు. వాళ్లిద్ద‌రూ డేటింగ్‌లో ఉన్నారు. వాళ్లు హ్యాపీగా ఉండ‌ట‌మే మాకు కావాలి. మేము సంతోషంగా ఉన్నాం అని అన్నాడు.

ఇది కూడా చదవండి: కొంచెం టైం పడుతుంది….ప్రియమణి

Advertisement

తాజా వార్తలు

Advertisement