Thursday, April 18, 2024

అర్హ నటన సూపర్ అంటున్న సమంత….థాంక్స్ చెప్పిన బన్నీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ శాకుంతలం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో అర్హ నటించబోతున్నారు. అయితే అర్హ నటనకు సంబంధించి సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అంతేకాకుండా ఫస్ట్ షాట్ ఎలా చేసిందో కూడా చెప్పుకొచ్చారు. ఫస్ట్ షాట్ అయిపోయింది. అదరగొట్టేసింది. ఆమెకు రాసిన డైలాగ్స్ అన్నీ కూడా అదిరిపోతాయి. సూపర్ గా ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చింది. అయితే సమంత చేసిన ఈ పోస్ట్ కు అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి స్పందించారు. షాట్స్ లో అర్హ కు హెల్ప్ చేసినందుకు థాంక్స్ సమంతా అంటూ చెప్పుకొచ్చింది. అలాగే బన్నీ కూడా సమంత కు థాంక్స్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement