Tuesday, May 7, 2024

‘సమ్మతమే’ అంటున్న కిరణ్​ అబ్బవరం.. పోస్టర్​ రిలీజ్​ చేసిన మూవీ మేకర్స్​

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తనదైన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ప్రతిభావంతుడైన నటుడు ఇప్పుడు తన తదుపరి చిత్రం ‘సమ్మతమే’తో వస్తున్నాడు. దీనికి నూతన దర్శకుడు గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో చాందిని చౌదరి కథానాయికగా నటిస్తోంది. ఈరోజు సమ్మతమే సినిమా విడుదల తేదీని చిత్ర పోస్టర్‌తో ప్రకటించారు మేకర్స్. జూన్ 24న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

కాగా, రిలీజ్​ చేసిన పోస్టర్‌లో చాందిని చౌదరి తోటలో బట్టలు ఆరబెట్టుకుంటూ కనిపిస్తుండగా, కిరణ్ అబ్బవరం ఆమెను వెనుక నుండి ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాని యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కంకణాల ప్రవీణ నిర్మించారు. ‘సమ్మతమే’ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించగా, సతీష్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement