Thursday, May 9, 2024

మళ్ళీ ఇదే బ్యూటీతో కొరటాల ‘ఎన్టీఆర్ కోసం’ ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రం నిర్మాణం కాబోతోంది. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడే రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు చిత్రయూనిట్. 2022 ఏప్రిల్ 29న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.

గతంలో ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ సినిమా వచ్చింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ గా కనిపించబోతున్నాడట. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ మ్యూజిక్ ఇవ్వబోతున్నారని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement