Sunday, April 28, 2024

వంట గదిలో గరిటె పట్టిన మహానటి…వీడియో వైరల్

కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్ లు లేక సినీతారలు ఇంటికే పరిమితం అయ్యారు. ఖాళీ సమయాల్లో వంటపని ఇంటిపని చేస్తూ కాలాన్ని గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ వంటగదిలో గరిటె పట్టారు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తనకెంతో ఇష్టమైన రెసిపీని కీర్తి సురేష్ వండారు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అంతేకాకుండా కరోనా మహమ్మారి కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు కీర్తి సురేష్. ఇక సినిమాల విషయానికి వస్తే కీర్తిసురేష్ సర్కారు వారి పాట సినిమా చేస్తోంది. అలాగే రజనీకాంత్ సినిమాలో కూడా నటిస్తోంది. వీటితో పాటు మరికొన్ని చిత్రాల్లో కూడా ఈ అమ్మడు నటిస్తోంది.

https://www.instagram.com/p/CPfh2IUJLq0/?utm_source=ig_web_copy_link

Advertisement

తాజా వార్తలు

Advertisement