Friday, May 3, 2024

మరోడిఫ‌రెంట్ స్టోరీతో వ‌స్తోన్న క‌ళ్యాణ్ రామ్.. ‘‘డెవిల్’’ రిలీజ్ డేట్ ఫిక్స్..

నంద‌మూరి హీరో క‌ళ్యాణ్ రామ్ న‌టిస్తోన్న లేటెస్ట్ పీరియాడిక్ స్పై థ్రిల్ల‌ర్ మూవీ ‘డెవిల్’. గ‌త ఏడాది సినీ ఇండ‌స్ట్రీలో వ‌న్ ఆఫ్ బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచిన ‘బింబిసార’తో మెప్పించిన కళ్యాణ్ రామ్.. ఈ ఏడాది అదే జోష్ లో మరో డిఫరెంట్ సినిమా అయిన డెవిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నవీన్ మేడారం దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ మూవీని అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సంయుక్తా మీన‌న్ హీరోయిన్ గా న‌టిస్తోంది.

ఇక రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా గ్లింప్స్‌తో సినిమాపై ఉన్న అంచ‌నాలు నెక్ట్స్ రేంజ్‌కు చేరుకున్నాయి. ప్రేక్ష‌కులు, అభిమానులు ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తుండ‌గా.. న‌వంబ‌ర్ 24న ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ మూవీని భారీ ఎత్తున రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు మేక‌ర్స్.

- Advertisement -

ఈ మూవీని తెలుగు, హిందీ, త‌మిళ్‌, క‌న్న‌డ భాష‌ల్లో రిలీజ్ చేస్తున్నారు. శ్రీకాంత్ విస్సా ఈ సినిమాకి మాట‌లు, స్క్రీన్ ప్లే, క‌థ‌ను అందించారు. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ సంగీత ద‌ర్వ‌కత్వం వ‌హిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement