Tuesday, April 30, 2024

ఆసియా కప్​ పోరుకు అంతా రెడీ.. షెడ్యూలు, టైమింగ్స్​ ఇవే..

మ‌రికొద్ది రోజుల్లోనే క్రికెట్ పండుగ‌ ప్రారంభం కానుంది. ఆసియా కప్ 2023 కోసం అన్ని ఏర్పాట్లు జ‌రిగాయి. ఆగస్ట్ 30న తొలి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. కొద్ది రోజుల క్రితమే ఆసియా క‌ప్ షెడ్యూల్ విడుదలైంది.. ఇక‌ ఇప్పుడు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) 30 ఆగస్ట్ 2023 నుండి 17 సెప్టెంబర్ వ‌ర‌కు జరిగే 13 మ్యాచ్‌ల టైమింగ్స్ ని వెల్లడించింది. ఈ టోర్నీలోని అన్ని మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభ‌మ‌వుతాయి.

ఈ టోర్నమెంట్‌లో ఆరు ఆసియా జట్లు..(భారత్, పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్) పాల్గొంటాయి. బహుళ-దేశాల ఈవెంట్ రెండు దశలుగా (గ్రూప్ స్టేజ్, సూపర్ ఫోర్స్) జ‌ర‌గ‌నుంది. కాగా, ఆసియా కప్ రెండు దేశాల్లో, నాలుగు వేదికలలో జరుగుతుంది. టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్ పాకిస్తాన్​లోని ముల్తాన్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది.

కాగా, కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. కాండీ, కొలంబోలో మొత్తం 9 మ్యాచ్‌లకు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వగా, ముల్తాన్, లాహోర్‌లలో పాకిస్థాన్ 4 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక, ఆసియా కప్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్‌, పాకిస్థాన్‌ 13 మ్యాచ్‌ల్లో 3 సార్లు తలపడే అవకాశం ఉంది. ఒకసారి గ్రూప్ స్టేజ్ (గ్రూప్ A), ఒకసారి సూపర్ ఫోర్స్ మ‌రోక‌టి ఫైనల్‌లో అర్హత సాధిస్తే.

Advertisement

తాజా వార్తలు

Advertisement