Thursday, May 2, 2024

సుడిగాలి సుధీర్ హీరోగా కాలింగ్ స‌హ‌స్ర‌.. లిరిక‌ల్ సాంగ్ రిలీజ్

సుడిగాలి సుధీర్ బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌య‌స్తుడే..కాగా బుల్లితెర‌తో పాటు వెండితెర‌పై కూడా దూసుకుపోతున్నాడు ఈ న‌టుడు. హీరోగా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటూనే ఉన్నాడు.. ఇప్ప‌టికే రెండు మూడు చిత్రాల‌తో హీరోగా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు సుధీర్. కాగా ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం కాలింగ్ సహస్ర .ఈ సినిమాకు అరుణ్ విక్కిరాలా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సుధీర్ సరసన డోలిశ్య హీరోయిన్ గా నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి తాజాగా కలయా నిజమా అనే లిరికల్ సాంగ్ విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రానికి మెహిత్ రహ్ మానిక్ సంగీతం అందిస్తుండగా.. కలయా నిజమా పాటకు లక్ష్మీ ప్రియాంక సాహిత్యం అందించారు. ప్రముఖ సింగర్ కె.చిత్ర ఈ మధురమైన గీతాన్ని ఆలపించారు. ఈ సాంగ్ శ్రోతలను ఆకట్టుకుంటుంది. లెజెండ్రీ సింగ‌ర్‌ చిత్ర‌గారు అద్భుతంగా పాడారు. మోహిత్ రెహ‌మానిక్‌ అందించిన ట్యూన్‌, దానికి ల‌క్ష్మీ ప్రియాంకగారు రాసిన లిరిక్స్ బ్యూటీఫుల్‌గా కుదిరాయి. సుడిగాలి సుధీర్‌, డోలిశ్య మ‌ధ్య కెమిస్ట్రీ బ్యూటీఫుల్‌గా ఉంటుంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేయ‌నున్నారు. ఈ చిత్రాన్ని షాడో మీడియా ప్రొడక్షన్స్, రాధా ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు.

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement