Saturday, May 4, 2024

ట్రైన్స్ లో కంపార్ట్ మెంట్ ల‌ పున‌రుద్ద‌రణ కోసం.. రైల్వే మంత్రిత్వశాఖని సంప్రదించిన ఇండియన్ ఆర్మీ

క‌రోనా స‌మ‌యంలో రైల్వే శాఖ ఆర్మీ కంపార్ట్ మెంట్ స‌దుపాయాన్ని నిలిపి వేసింది. దాంతో ప‌లు రైళ్ల‌ల్లో మాత్ర‌మే ఆర్మీ కంపార్ట్ మెంట్స్ ఉన్నాయి.ఇది ఇలా ఉండ‌గా రైళ్లలో ఆర్మీ కంపార్ట్‌మెంట్‌ను పునరుద్ధరించాలని రైల్వే మంత్రిత్వ శాఖను ఇండియన్ ఆర్మీ సంప్రదించింది. ఆఫీసర్ ర్యాంకు కంటే తక్కువ సిబ్బందికి సౌలభ్యం కోసం అన్ని రైళ్లలో సదుపాయాన్ని కల్పించాలని కోరారు. సైనికుల సౌకర్యానికి సైన్యం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి: ఆర్మీ కంపార్ట్‌మెంట్ (నాన్ ఏసీ) అటాచ్‌మెంట్ అనేది కొన్ని రైళ్లలో రిజర్వేషన్ లేకుండా ప్రయాణించడానికి యూనిఫాం ధరించిన అన్ని బలగాలకు రైల్వేలు కల్పించిన సదుపాయం.

ఆర్మీ వెటరన్స్, పౌర సమాజ సభ్యుల బృందం.. ఇతర ర్యాంక్ సిబ్బంది కోసం ఈ సదుపాయాన్ని పునరుద్ధరించడం కోసం ఆన్‌లైన్ ప్రచారాన్ని చేస్తోంది. నాన్-ఎసి ఆర్మీ కంపార్ట్‌మెంట్‌లలో రిజర్వ్‌ లేకుండా ప్రయాణించే బదులు సైనికులు సౌకర్యంగా, అర్హత ప్రకారం ప్రయాణించడానికి ఇప్పటికే మరింత పటిష్టమైన పద్ధతులను ఏర్పాటు చేసినట్లు భారత సైన్యం వర్గాలు తెలిపాయి. డిజిటలైజేషన్ ప్రక్రియలో భాగంగా.. సైన్యంలోని 95 శాతానికి పైగా యూనిట్లు ఇ-టికెటింగ్‌లో చురుకుగా ఉన్నాయి, మొత్తం ఆర్మీ మూమెంట్స్‌లో 94 శాతానికి పైగా ఇ-టికెట్ల ద్వారా అర్హులైన రిజర్వ్‌డ్ క్లాస్‌లో జరుగుతాయి అని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఆర్మీ యూనిట్లలో ఇ-టికెటింగ్ సదుపాయానికి తత్కాల్ సదుపాయం కూడా జోడించబడిందని ఆ వర్గాలు తెలిపాయి. అవసరమైన ప్రాతిపదికన మిలటరీ కోచ్‌లు జోడించబడుతున్నాయ‌ని తెలిపాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement