Sunday, April 28, 2024

కీర్తి కళావతి గా రాబోతుంది!!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్ పేరుతో ఒక వీడియోను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ వీడియో సోషల్ మీడియాతో అదరగొట్టాడు మహేష్ బాబు. అయితే కీర్తి సురేష్ ను కూడా ఈ టీజర్ లో కూడా పరిచయం చేశాడు దర్శకుడు. ఇదిలా ఉండగా మహేష్ బాబుకు చాలా మంది సెలబ్రెటీలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

కీర్తి సురేష్ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మీరు తెరపై మాత్రమే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కూడా స్ఫూర్తి.. అద్భుతమైన సహనటుడు. అందమైన వ్యక్తి. పుట్టినరోజు శుభాకాంక్షలు మహేష్ బాబు సర్ అంటూ ట్వీట్ చేసింది. దానికి మహేష్ స్పందిస్తూ…ధన్యవాదాలు కళావతి…అంటూ చెప్పారు. ఇంకేముంది ఇందులో కీర్తి రోల్ కళావతి అని అర్థమయిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement