Sunday, April 28, 2024

మార్షల్ ఆర్ట్స్ పై దృష్టి పెట్టిన కాజల్ ?

అక్కినేని నాగార్జున ఇటీవల వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో చేపకళ్ళ సుందరి కాజల్ అగర్వాల్ కూడా నటిస్తోంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై నారాయణ దాస్ కె నారంగ్, రామ్మోహన్ రావు, శరత్ కుమార్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ఓ రా ఏజెంట్ గా కనిపించబోతోంది. ఇక కాజల్ కొన్ని యాక్షన్ సన్నివేశాలలో కూడా పాల్గొన్న బోతుందట. ఈ నేపథ్యంలోనే కాజల్ అగర్వాల్ ప్రస్తుతం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నారట. అయితే కాజల్ ఏ విధమైనటువంటి యాక్షన్ సీన్స్ లో పాల్గొనబోతుందనేది చూడాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement