Friday, April 19, 2024

ఇంగ్లాండ్ జట్టుకు షాక్..గాయంతో ఆర్చర్‌ నాలుగు వారాలు దూరం

సొంతగడ్డపై కీలక సిరీస్‌ల ముంగిట ఇంగ్లాండ్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మోచేతికి శస్త్రచికిత్స కారణంగా ఇంగ్లాండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ జోఫ్రా ఆర్చర్‌ నాలుగు వారాల పాటు క్రికెట్‌కు దూరంకానున్నాడు. సర్జరీ కారణంగా జూలై వరకు అతడు జాతీయ జట్టు తరఫున క్రికెట్‌ ఆడే అవకాశం లేదు. ఆ తర్వాత కూడా అతడి గాయం పూర్తిగా నయమైతేనే మళ్లీ జట్టులోకి రానున్నాడు. జూన్‌ 2 నుంచి న్యూజిలాండ్‌తో జరిగే రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత జూన్‌ 23 నుంచి శ్రీలంకతో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు అతడు దూరంకానున్నాడు. భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌ ఆగస్టు 4న ఆరంభంకానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement