Sunday, May 19, 2024

మాస్టర్ సినిమా రికార్డ్ బ్రేక్… జాతి రత్నాలా మజాకా !!

నూతన దర్శకుడు అనుదీప్ దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం జాతిరత్నాలు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించడంతో పాటు పెద్ద స్థాయిలో కలెక్షన్లు కూడా సాధిస్తోంది. గతంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్ద సినిమాలు క్రాక్, మాస్టర్ లాంటివి కూడా మంచి వసూళ్లను సాధించినప్పటికీ.. వాటిని దీటు గా జాతి రత్నాలు సినిమా దూసుకుపోతోంది.

మరోవైపు విదేశాల్లో కూడా జాతి రత్నాలు బాగానే వసూళ్లను రాబడుతోంది. ఇప్పటికే రెండు కోట్ల షేర్ వసూలు చేసింది. ప్రీమియర్స్ తో ఏకంగా లక్షల 33 వేల డాలర్లు వసూలు చేసి మాస్టర్ సినిమా రికార్డును సైతం బద్దలు కొట్టింది. ఒక్కమాటలో చెప్పాలంటే తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ జాతిరత్నాలు వసూళ్ల విషయంలో అదర గొడుతున్నారనే చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement