Sunday, May 19, 2024

Jai HanuMan | ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్..

దర్శకుడు ప్రశాంత్ వర్మ తెర‌కెక్కించిన ఇండియ‌న్ సూప‌ర్ హీరో మూవీ ‘హనుమాన్’. ఈ సినిమాతో ఒక సినిమా యూనివర్స్ ని క్రియేట్ చేశారు ప్రశాంత్ వర్మ. ఇక ఈ సినిమా ఎండింగ్‌లోనే సీక్వెల్ (జై హనుమాన్)ని కూడా ప్రకటించేశారు. ఇక హనుమాన్ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో ఆడియన్స్ అంతా ‘జై హనుమాన్’ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో అని ప్రశ్నలు వేస్తున్నారు.

కాగా, హనుమాన్ సీక్వెల్ ‘జై హనుమాన్’ మూవీ పనులు మొదలు పెట్టినట్ట ప్రకటించారు మేకర్స్‌. ఇవ్వాల అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం కావడంతో ఈ బ్రహ్మాండమైన రోజునే ‘జై హనుమాన్’ మూవీ ప్రీ ప్రోడ‌క్ష‌న్ పనులు మొదలు పెట్టిన‌ట్లు ప్రశాంత్ వర్మ తెలిపారు.

కాగా ఈ మూవీ కథ అంతా హనుమాన్ పాత్ర చుట్టూనే తిరుగుతుందని ప్రశాంత్ వర్మ పేర్కొన్నారు. ఇక ఈ పాత్ర కోసం టాలీవుడ్ స్టార్ హీరోని తీసుకోబోతున్నట్లు రీసెంట్ ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఈ కారణంతోనే మొదటి పార్ట్ లో హనుమంతుడి ఫేస్ ని రివీల్ చేయలేదని పేర్కొన్నారు. అయితే ఆ స్టార్ హీరో ఎవరు అన్నది మాత్రం తెలియజేయలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement