Monday, April 29, 2024

‘జగ్గూభాయ్ కోసం’ మహాసముద్రం లో రంభ !!

ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్దార్థ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రం మహాసముద్రం. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్, అతిథి రావు హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఆగస్టు 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.

ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మహాసముద్రం సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ను పెట్టాడట దర్శకుడు అజయ్ భూపతి. ఆ సాంగ్ లో సీనియర్ నటి రంభ కటౌట్లు, ఫోటోలు ఏర్పాటు చేశాడట. అలాగే ఈ సినిమాలో జగపతి బాబు రంభ అభిమానిగా కనిపించనున్నాడట. ఇక ఈ పాట షూటింగ్ కి ముందు రంభ పర్మిషన్ కూడా తీసుకున్నారట యూనిట్.

Advertisement

తాజా వార్తలు

Advertisement