Thursday, April 25, 2024

స్థానికుల కోసం చలివేంద్రం..

దేవరకద్ర : మండల కేంద్రంలో గ్రామపంచాయితీ కార్యాలయం వద్ద ప్రజల దాహార్తి కొరకు గ్రామపంచాయితీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎండ వేడిమికి భరించలేక ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని గ్రామపంచాయితీ సిబ్బంది చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని ప్రజలు సద్విని యోగం చేసుకోవాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ అధికారులు , సిబ్బంది వారు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement