Thursday, May 2, 2024

ఆర్ఆర్ఆర్ కొత్త రిలీజ్ డేట్ ఇదే ?

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ కొమరం భీమ్ గా కనిపించనున్నారు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా కనిపించబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించి విడుదలైన టీజర్ లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికే ఈ సినిమా కరోనా కారణంగా రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకుంటూ వస్తోంది. ఇక ఇప్పుడు అక్టోబర్ 13న విడుదల చేయాలని భావించినా అది కూడా కష్టమనే తెలుస్తోంది.

తాజా సమాచారం 73వ రిపబ్లిక్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని జనవరి 26న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్ స్వాతంత్య్రం కోసం పోరాడిన వారే కాబట్టి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ఇది కరెక్ట్ టైం అని భావిస్తున్నారట.

Advertisement

తాజా వార్తలు

Advertisement