Monday, April 29, 2024

పుష్ప లో బన్నీకి ఉన్న లోపం ఇదే ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లారీ డ్రైవర్ పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ కనిపించబోతున్నాడు. రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా డైరెక్టర్ సుకుమార్ ప్రతి సినిమాలోనూ హీరోకు లోపం ఉండేటట్టు కథని సిద్ధం చేస్తూ ఉంటారు. అయితే ఇందులో అల్లు అర్జున్ ఎలాంటి లోపం తో కనిపించబోతున్నాడు అనేది ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొనగా…తాజా సమాచారం ప్రకారం… ఈ సినిమాలో అల్లు అర్జున్ కుడి భుజం సరిగ్గా పనిచేయదట.

దాక్కో దాక్కో మేక పాటలో కూడా బన్నీ అందుకే ఎడమ భుజంతోనే దర్శనమిచ్చాడట. అయితే దీనిపై మాత్రం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా… క్రిస్మస్ కు రిలీజ్ కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement