Wednesday, May 15, 2024

మా ఆట స్థలాన్ని తీసుకోవద్దు.. కలెక్టర్ కు చిన్నారుల విన్నపం

తాము ఆడుకునే స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేయకండి అంటూ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌కు సంతబొమ్మాళి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వినూత్నంగా విజ్ఞప్తి చేశారు. తాము ఆడుకునే మైదానంలో కోల్డ్‌ స్టోరేజీ నిర్మించొద్దని వేడుకున్నారు. తమకు ఆడుకునేందుకు ఈ ఒక్క గ్రౌండే ఉందని.. ఇక్కడ కోల్డ్ స్టోరేజీ నిర్మించాలని అనుకుంటున్నారని, ఆ ప్రతిపాదనను విరమించుకోవాలని చిన్నారులు కలెక్టర్‌కు వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలో.. కోల్డ్ స్టోరేజీ లేకపోవడంతో భావనపాడు ప్రాంత మత్స్యకారులు చేపలను నిల్వ చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను మత్స్యకారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సంతబొమ్మాళిలో కోల్డ్ స్టోరేజీ నిర్మాణానికి ప్రభుత్వ భూమిని కేటాయించింది. అయితే, ఇక్కడే విద్యార్థులు ఆడుకుంటూ ఉంటారు. దీంతో తమకు ఆడుకోవడానికి మరో స్థలం లేదని.. ఇక్కడ ఎలాంటి నిర్మాణం చేపట్టొద్దని పిల్లలు కోరుతున్నారు.

ఇది కూడా చదవండిః హైదరాబాద్ జంట పేలుళ్లకు 14 ఏళ్లు!

Advertisement

తాజా వార్తలు

Advertisement