Monday, April 29, 2024

దేశంలో కరోనా డెల్టా ప్లస్ దడ.. బయటపడుతున్న కొత్త కేసులు!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇంకా తగ్గకముందే.. కరోనా డెల్టా ప్లస్ వేరియింట్ కలవరపెడుతోంది. కరోనా డెల్టా ప్లస్‌ వేరియంట్‌ మహారాష్ట్రలో రోజు రోజుకు విస్తరిస్తున్నది. మంగళవారం ఒక్క రోజే కొత్తగా 27 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో డెల్టా ప్లస్‌ కేసులు 103కు చేరాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన వాటిలో గడ్చిరోలి, అమరావతిలో ఆరు చొప్పున, నాగ్‌పూర్‌లో ఐదు, అహ్మద్‌నగర్‌లో నాలుగు, యావత్మల్‌లో మూడు, నాసిక్‌లో రెండు, భాంద్రాలో ఒకటి చొప్పున ఉన్నాయి. మరోవైపు ముంబైలో 188 నమూనాలను సేకరించగా 128 నమూనాల్లో డెల్టా వేరియంట్‌ లక్షణాలు ఉన్నాయని, మరో రెండింటలో ఆల్ఫా వేరియంట్‌ లక్షణాలు ఉన్నాయని బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) వెల్లడించింది.

మరోవైపు కరోనా డెల్టా వేరియంట్​​ సోకిన వారిలో వ్యాధి లక్షణాలు మొదట బయటపడినప్పుడే వైరల్ లోడు 300 రెట్లు అధికంగా ఉంటుందని ఓ పరిశోధనలో తెలింది. అయితే నాలుగు రోజుల తర్వాత వైరల్‌ లోడు(30 రెట్లకు, 9 రోజుల తర్వాత 10 రెట్లకు తగ్గుతుందని పరిశోధకులు చెప్పారు. కొరియా డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ ఏజెన్సీ(కేడీసీఏ) శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. 

ఇదిలా ఉంటే.. వ్యాక్సిన్ వేయించుకున్న, వేయించుకోనివారికి సమానస్థాయిలో డెల్టా వేరియంట్​ సోకుతోందని ఇండియన్​ కౌన్సిల్​ ఆఫ్ మెడికల్ రీసెర్చ్​ (ఐసీఎం​ఆర్​) తెలిపింది. కానీ టీకా వేయించుకోనివారితో పోలిస్తే.. వ్యాక్సిన్​ పొందినవారిలో మరణాల రేటు తగ్గుతుందని వెల్లడించింది.

ఇది కూడా చదవండిః దేశంలో మరోసారి విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా ఎన్ని కేసులంటే..

Advertisement

తాజా వార్తలు

Advertisement