Sunday, March 24, 2024

భీమ్లా నాయక్…ఫస్ట్ సింగిల్ కి ముహూర్తం ఫిక్స్ ?

సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. అలాగే రానా రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. పవన్ సరసన నిత్యమీనన్ నటిస్తుండగా… రానా సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు.

మలయాళంలో సూపర్ హిట్ సాధించిన అయ్యప్పనుమ్ కొషియమ్ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం… సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కానుకగా ఫస్ట్ సింగిల్ ని విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. అందుకు సంబంధించి ప్రోమో అనౌన్స్మెంట్ ఈ ఆగస్టు నెల ఆఖరుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నిర్మితమవుతున్న ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement