Saturday, May 18, 2024

ప్రేమ కథా చిత్రాలు చేయాలని ఉంది

వైద్యవైవిధ్యమైన చిత్రాల్లో నటించే హీరోల్లో వరుణ్‌ తేజ్‌ ఒకరు. తాజాగా ఆయన నటించిన థ్రిల్లర్‌ చిత్రం ‘గాండీవధారి అర్జున’. సాక్షి వైద్య హీరోయిన్‌. ప్రవీణ్‌ సత్తారు దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్‌ నిర్మించిన ఈ చిత్రం ఇదే నెల 25న విడుదలకానుంది. ఈ సందర్భంగా హీరోయిన్‌ సాక్షి వైద్య మీడియాతో ముచ్చటించారు. ఆమె చెప్పిన విశేషాలివే..-

నేను నటించిన ఏజెంట్‌ సినిమా విడుదలకుముందే కొన్ని షాట్స్‌ను ప్రవీణ్‌ సార్‌ చూశారు. ఐరా పాత్రకు నేను సరిపోతానని భావించారు. అందుకే తీసుకున్నారు. సినిమాలో మంత్రిగా నాజర్‌ గారి పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటు-ంది. ఆయన పక్కనే కనిపించే నా పాత్ర చాలా బాగుంటు-ంది.- దర్శకులు ప్రవీణ్‌ గారు సన్నివేశాలను తెరకెక్కించే విధానం ఎంతో క్రియేటివ్‌గా ఉంటాయి. భిన్న రకాలుగా తీస్తుంటారు.- వరుణ్‌ తేజ్‌ పెద్ద కుటుంబం నుంచి వచ్చాడు.. ఎలా ఉంటాడో అని నేను అనుకునేదాన్ని కానీ ఆయన ఎంతో ఒదిగి ఉండేవారు.. నాకు ఈ ప్రయాణంలో ఆయన ఎంతో సాయం చేశారు.

– ఏజెంట్‌ బాగా ఆడకపోవడం కాస్త బాధ అనిపించింది. టీ-ం ఎంతో కష్టపడి పని చేసింది.. అంత కష్టపడి పని చేసినా ఫెయిల్‌ అవ్వడం బాధగా అనిపించింది.- ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ షూటింగ్‌ త్వరలోనే మొదలవుతుంది. ఆ తర్వాత సాయి ధరమ్‌ తేజ్‌ గారి సినిమాను చేస్తున్నాను.- దర్శకుడు ప్రవీణ్‌ గారు చకచకా షూటింగ్‌ పూర్తి చేయడంతో కనీసం వ్యానిటీ-కి వెళ్లి రెస్ట్‌ తీసుకునే -టైం కూడా దొరకలేదు. అలా ఫాస్ట్‌గా షూట్‌ చేయడంతో ఎప్పుడూ ఆ పాత్రలోనే ఉండేదాన్ని.- సమంత చేసిన యశోద లాంటి సినిమాలు, ప్రేమ కథా చిత్రాలు చేయాలని ఉంది. ఈ సినిమాకు నేనే డబ్బింగ్‌ చెప్పుకున్నాను.- నిర్మాతలు బాపినీడుగారు, బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ గారు చాలా మంచి వారు. బాపి గారు ఎప్పుడూ సెట్స్‌ మీదకు వచ్చేవారు. అందరినీ పలకరించేవారు.- మిక్కీ జే మేయర్‌ గారి సంగీతం అద్భుతంగా ఉంటు-ంది. ఆయన హిందీలో చేసిన పాటలు నాకు చాలా ఇష్టం. ఈ సినిమాకు మంచి పాటలు ఇచ్చారు.-

- Advertisement -

తెలుగు ప్రేక్షకులు నన్ను చాలా ప్రేమిస్తున్నారు. తెలుగు భాషను నేర్చుకుని అభిమానుల ప్రేమను తిరిగి ఇస్తాను. నాకు తెలుగులో అల్లు అర్జున్‌ అంటే ఇష్టం. రామ్‌ చరణ్‌ గారు నటించిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను చూశాను. మా -టైలర్‌ను ఆయన రిలీజ్‌ చేస్తుండటం ఆనందంగా ఉంది. దుల్కర్‌ సల్మాన్‌తో లక్కీ భాస్కర్‌, సాయిధరమ్‌ తేజ్‌.. సినిమాల్లోనూ నటిస్తున్నాను. రవితేజ గారితోనూ నటించే అవకాశం ఉంది

Advertisement

తాజా వార్తలు

Advertisement