Sunday, May 5, 2024

ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ భారీ షెడ్యూల్‌…

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’. ఇంతకు ముందు పవన్‌ కల్యాణ్‌, దర్శకుడు హరీష్‌ శంకర్‌ కంబినేషన్‌లో ‘గబ్బర్‌ సింగ్‌’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. మళ్లిd ఇదే కాంబినేషన్‌ ఉస్తాద్‌ భగత్‌సింగ్‌తో రిపీట్‌ అవుతోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, వై రవి శంకర్‌ నిర్మిస్తున్నారు.’ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ తాజా షెడ్యూల్‌ సెప్టెంబర్‌ 5 నుంచి ప్రారంభం కానుంది. ఇది భారీ షెడ్యూల్‌.

పవన్‌ కళ్యాణ్‌తో పాటు- ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఈ షెడ్యూల్‌ కోసం ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనంద్‌ సాయి, అతని టీ-మ్‌ భారీ సెట్‌ను నిర్మించారు.ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూరస్తున్నారు. అయనంక బోస్‌ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ఛోటా కె ప్రసాద్‌ ఎడిటర్‌ గా పని చేస్తున్నారు.అశుతోష్‌ రానా, నవాబ్‌ షా, కేజీఎఫ్‌ ఫేమ్‌ అవినాష్‌, గౌతమి, నర్రా శ్రీను, నాగ మహేష్‌, -టె-ంపర్‌ వంశీ ఇతర తారాగణం

Advertisement

తాజా వార్తలు

Advertisement