Monday, April 29, 2024

బర్త్ డే స్పెషల్… అదిరిపోయే అప్డేట్ ఇవ్వనున్న మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన లుక్స్, సాంగ్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇదిలా ఉండగా ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మెగా అభిమానులు అంతా కూడా మెగాస్టార్ నుంచి రాబోయే అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ను ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అయితే అది ఏంటి అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement