Sunday, April 28, 2024

వ‌క్కంతం వంశీ డైరెక్ష‌న్ లో..హీరో నితిన్

ద‌ర్శ‌కుడు వ‌క్కంతం వంశీ డైరెక్ష‌న్ లో హీరో నితిన్ ఓ సినిమాలో న‌టించ‌నున్నాడు. నితిన్‌కు జోడీగా శ్రీలీల నటిస్తుంది. ఈ సినిమాకు హారిస్‌ జయరాజ్‌ స్వరాలు సమకూర్చుతున్నాడు. గతేడాది షూటింగ్‌ ప్రారంభించిన ఈ సినిమా ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. ఇక ఇప్పటికి వరకు ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్‌ కూడా బయటకు రాలేదు. దాంతో అసలు ఈ సినిమా ఉందన్న విషయమే చాలా మంది సినీ లవర్స్ మర్చిపోయారు.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. ఈ సినిమాను వినాయక చవితి సందర్భంగా రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారట. అదే దిశగా షూటింగ్‌ను వేగవంతం కూడా చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో నితిన్‌ స్మగ్లర్‌గా కనిపించనున్నట్లు సమాచారం. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రేష్ఠ్ మూవీస్‌ బ్యానర్‌పై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement