Friday, May 3, 2024

2024 అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో జో బైడ‌న్, డోనాల్డ్ ట్రంప్

వాషింగ్ట‌న్ – 2024 అమెరికా అధ్య‌క్ష బ‌రిలో ప్ర‌స్తుత అమెరికా అధ్య‌క్షుడు జో బైడ‌న్ మాజీ అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ త‌ల‌ప‌డ‌నున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడ‌న్ మ‌రోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఇందుకోసం బిడెన్ తన ఎన్నికల ప్రచార బృందాన్ని ప్రకటించారు. బిడెన్ తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడానికి సీనియర్ వైట్ హౌస్ అధికారి, దీర్ఘకాల డెమోక్రటిక్ పార్టీ కార్యకర్త జూలీ చావెజ్ రోడ్రిగ్జ్‌ను మళ్లీ ఎంచుకున్నారు. అంత‌కు ముందు మీడియాతో జో బైడ‌న్ మాట్లాడుతూ, తాను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలో ఉన్నానని వెల్ల‌డించారు.. డెమోక్రాటిక్ పార్టీ కూడా త‌న అభ్య‌ర్థిగా జో నే మ‌రోసారి ఎంపిక చేసింది..ఇక 2024 ఎన్నిక‌ల‌లోనూ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోటీ చేయ‌నున్నారు.. అధ్యక్ష నామినేషన్ కోసం రిపబ్లికన్ అభ్యర్థిగా తన నామినేషన్‌ను ప్రకటించారు. అమెరికా తదుపరి అధ్యక్షుని ఎన్నిక నవంబర్ 5, 2024న జర‌గ‌నుంది.. దీంతో మ‌రోసారి జో బైడ‌న్, డోనాల్డ్ ట్రంప్ మ‌ధ్య ర‌స‌వ‌త్తర పోరు జ‌ర‌గ‌నుంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement