Sunday, May 5, 2024

వకీల్ సాబ్ తో గంగుభాయ్ సందడి..

బాలీవుడ్ బ్యూటీ అలియాభ‌ట్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్ర గంగూభాయ్ క‌తియావాడి. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ తెలుగు టీజర్ విడుదలయింది. వకీల్ సాబ్ థియోటర్ లలో ఈ మూవీ ట్రైలర్ ప్రదర్శితమవుతోంది. ముంబైలోని కామాతిపురాలో సెక్స్ వ‌ర్క‌ర్‌ అయిన గంగూభాయ్ క‌తియావాడి జీవిత‌క‌థ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాడు సంజయ్ లీలా భన్సాలీ. ఈ చిత్రంలో అలియా భట్ వేశ్య పాత్ర‌లో నటిస్తుంది. తాజాగా తెలుగు వ‌ర్షెన్‌కు సంబంధించిన టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఈ టీజ‌ర్ టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ని సైతం ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. అలియా హావ‌భావాల‌కు త‌గ్గ‌ట్టు డబ్బింగ్ చ‌క్క‌గా చెప్పారు. ప‌లు వివాదాల న‌డుమ రూపొందుతున్న ఈ సినిమా జూలై 30న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. తాజాగా విడుద‌లైన టీజర్ ‌పై మీరు ఓ లుక్కేయండి.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement