Sunday, April 28, 2024

రామారావు తో ఇలియానా ఐటమ్ సాంగ్

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా చేస్తున్నాడు. అలాగే శరత్ మండవ దర్శకత్వంలో రామారావు ఆన్ డ్యూటీ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో గోవా బ్యూటీ ఇలియానా స్పెషల్ ఐటెం సాంగ్ లో నటించనుందని ఎప్పటి నుంచో టాక్ నడుస్తుంది.

అయితే ప్రస్తుతం ఈ పాటకు సంబంధించిన ఫైనాన్షియల్ అంశాల గురించి చర్చ జరుగుతోందట. నిజానికి ఇలియానా కు చేతిలో పెద్దగా సినిమాలు లేవు. అందుకే ఐటెం సాంగ్ చేయడానికి ఒప్పుకుందట. మరోవైపు తెలుగులో పూర్తి స్థాయిలో సినిమాలు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెబుతోంది. మరి ఈ అమ్మడికి దర్శకులు అవకాశం ఇస్తారో లేదో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement