Sunday, December 8, 2024

కర్నూలులో వెరైటీ పెళ్లి.. వధూవరులు లేకుండానే..

పెళ్లంటే ఆకాశమంత పందిరి.. భూదేవి అంత చాపలు పరిచేసి కోట్లు ఖర్చు కుమ్మరించేవారు. విందు, చుట్టాలు, వందలాది కాదు వేలాది మందికి భోజనాలు, అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. లక్షలు ఖర్చుచేసి పెద్ద కల్యాణ మండపాలు తీసుకునేవారు. కానీ ఇప్పుడు కరోనా దెబ్బతో పెళ్లిళ్లే కాదు.. పండుగలు పబ్బాలను కూడా తక్కువ మందితో దగ్గరి స్నేహితులతోనే చేసు కోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు కరోనా కారణంగా వివాహాలు కూడా ఆన్ లైన్ లో జరుగుతున్నాయి.  చివరికి పెళ్లికొడుకు, పెళ్లి కూతురు ఇద్దరూ మండపంలో లేకున్నా.. పెళ్లి తంతు జరుగుతోంది.  ఆన్ లైన్ లో పెళ్లి చేసుకొని డిజిటల్ లో అందరికీ చూపిస్తున్నారు. ఈ విచిత్ర సంఘటన కర్నూలు జిల్లాలో జరిగింది.

కర్నూలు జిల్లాకు చెందిన మధుసూదన్ రెడ్డి, శైలజారెడ్డి దంపతుల కుమార్తె రజితకు.. నల్గొండకు చెందిన వెంకట్రామిరెడ్డి, కవిత దంపతుల కుమారుడు దినేష్ రెడ్డితో వివాహం జరిపించాలని రెండేళ్ల క్రితం పెద్దలు నిర్ణయించారు. కానీ రజిత, దినేష్ ఇద్దరూ ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నారు. కరోనా కారణంగా వారు ఆస్ట్రేలియా నుండి భారత్‌కి వచ్చే అవకాశం లేదు. అలాగే రజిత తల్లిదండ్రులు సైతం ఆస్ట్రేలియా వెళ్లలేని పరిస్థితి. ఇప్పటికే కరోనా కారణంగా వివాహం ఆలస్యం కావడంతో ఇక చేసేదేం లేక ఆన్‌లైన్లో తంతు జరిపించారు. వధూవరులిద్దరూ ఆస్ట్రేలియా నుంచి పెళ్లి చేసుకోగా.. వారి ఆత్మీయులు, బంధుమిత్రులు కర్నూలులోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఆన్‌లైన్లో వారి పెళ్లిని తిలకించారు.

ఇది కూడా చదవండి: ఏపీకి రానున్న స్పీకర్ ఓం బిర్లా

Advertisement

తాజా వార్తలు

Advertisement