Tuesday, May 14, 2024

Allu Arjun : ఐకాన్ స్టార్ బ‌ర్త్ డే గిఫ్ట్ అదుర్స్ … వీడియోతో

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప 2 టీజర్ రిలీజ్ చేశారు. జాతర హడావిడితోపాటు అల్లు అర్జున్ ఊర మాస్ లో భీకరమైన అమ్మవారి లుక్కులో చాలా ఉగ్రరూపంతో కనిపించ‌డం టీజర్ కు మరింత బూస్ట్ ఇచ్చింది. ఇక ఇందులో విలన్స్ ను ఊచకోత కోసే యాక్షన్ ఎపిసోడ్ కూడా బలంగా ఉంది.

- Advertisement -
YouTube video

అల్లు అర్జున్ కత్తితో బొట్టు పెట్టుకోవడం అలాగే ఉగ్రరూపంతో స్టెప్పులు వేయడం వంటి అంశాలు కూడా మరింత హైలెట్ అవుతున్నాయి.ఇక లుక్ విషయంలో అల్లు అర్జున్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటాడో మరోసారి ఈ ఒక్క టీజర్ తో అర్థం అయిపోయింది. అతని అరికాలు నుంచి నుదుట బొట్టు వరకు అన్ని విషయాల్లో కూడా పక్కా లెక్కలతో సుకుమార్ ఇందులో అల్లు అర్జున్ ను ప్రజెంట్ చేసినట్లుగా అర్థమవుతుంది. చూస్తుంటే ఈ సన్నివేశం తోనే థియేటర్లో పూనకాలు తెప్పించేలా ఉన్నారు అనే కామెంట్స్ వస్తూ ఉన్నాయి.ఈ సినిమాను ఈ ఎడాది ఆగస్టు 15వ తేదీన గ్రాండ్ గా విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement