Sunday, April 28, 2024

MTV స్టేజ్ పై హైద‌రాబాదీ కుర్రాడి హ‌ల్చల్.. వైర‌ల్ గా మారిన కేడెన్ శ‌ర్మ ర్యాప్ సాంగ్

బాలీవుడ్ రియాలిటీ షోలో హైదరాబాదీ కుర్రాడు పాడిన ఓ ర్యాప్ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. MTV హజల్ 3 లో కొద్దిరోజుల క్రితం కంటెండర్ షిప్ కోసం హైద‌రాబాద్ కుర్రాడు కేడెన్ శర్మ పాడిన స్ట్రీట్ సెలబ్రెటీ పాట ప్ర‌స్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. హైదరాబాదీ ర్యాపర్ కేడెన్ శర్మ రియాలిటీ షోలో నగరంపై పాడిన పాటతో ఊహించని రీతిలో పాపులారిటీని సంపాదిస్తున్నాడు.

YouTube video

తానే లిరిక్ రైటర్ గా పాటను రాసుకుని..

- Advertisement -

ఓల్డ్ సిటీ స్లాంగ్ తో హైదరాబాద్ గురించి ఈ ర్యాప్ సాంగ్ ని పాడాడు కేడెన్ శర్మ. ఈ సాంగ్ లో హైదరాబాద్ గొప్పతనం గురించి వివ‌రిస్తూ.. హైదరాబాదీ బిర్యానీ, ఇరానీ ఛాయ్, ఛార్మినార్ లో చిన్న చిన్న వస్తువులు అమ్మే దుకాణాలు, అక్కడ ప్రజలు ఆడే బేరాలు ఇలా ఒకటేంటీ ఒక్క పాటలో హైదరాబాద్ ను కళ్ల ముందు కట్టాడు కేడెన్ శర్మ. హైదరాబాద్ కల్చర్, సిగ్నిఫికెన్స్, సినిమాలు, ఫుడ్ దేశవ్యాప్తంగా ఎలా స్టాండ్ అవుట్ అవుతున్నాయో చాలా కాన్ఫిడెంట్ గా ర్యాప్ చేసి వినిపించాడు కేడెన్.

సినిమాల్లో కూడా తన ర్యాప్ తో…

ఇక‌, సినిమాల ప‌రంగా.. పుష్పలో అల్లు అర్జున్ నేషనల్ వైడ్ ఎంత సెన్సేషన్, సాయిప‌ల్ల‌వి సింప్లిసిటీ & త‌ను న‌టించిన మారీ2 మూవీలో రౌడీ బేబీ సాంగ్, బాలీవుడ్ సినిమాల నిర్మాణానికి అడ్డాగా నిలుస్తున్న రామోజీ ఫిలింసిటీ, ఇక వ‌ర‌ల్డ్ వైడ్ పాపులారిటీ సాధించిన ఆర్ ఆర్ ఆర్ మూవీ, నాటు నాటు ఆస్కార్ విన్నింగ్ గురించి త‌న ర్యాప్ ద్వారా పాడుతూ MTV స్టేజ్ పై దుమ్మురేపాడు కేడెన్ శ‌ర్మ‌.

కేడెన్ శర్మ చూపించిన టాలెంట్ కు ఇంప్రెస్ అయిన జడ్జ్ బాద్షా సహా మిగిలిన టీమ్ లీడర్స్ కేడెన్ శర్మను కంటెండర్ సెలెక్ట్ చేస్తున్నట్లు యునానిమస్ గా ప్రకటించారు. ధూల్ పేట్ కు చెందిన కేడెన్ శర్మ 2019 లో తన పేరు మీద ఓ యూట్యూబ్ ఛానల్ ను స్టార్ట్ చేశాడు. తనే రాసుకుని పాడిన ర్యాప్ సాంగ్స్ ను అప్లోడ్ చేయటం మొదలుపెట్టాడు. 23ఏళ్ల వయస్సులో ఇప్పుడు MTV రియాల్టీ షో లో పాడిన పాట ద్వారా కేడెన్ శర్మ కష్టానికి బ్రేక్ వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement