Wednesday, May 8, 2024

శ్రీలీల బ‌ర్త్ డే.. ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ నుండి లుక్

వాయిస్ – బుధ‌వారం హీరోయిన్ శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఉస్తాద్‌ భగత్‌ సింగ్ నుంచి ఆమె లుక్‌ విడుదల చేశారు మేకర్స్‌.ఉస్తాద్‌తో శ్రీలీల డిస్కషన్‌ మూడ్‌లో ఉన్న తాజా లుక్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే భగవంత్ కేసరి, గుంటూరు కారం సినిమాల నుంచి శ్రీలీల లుక్స్ విడుదల చేయగా.. నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. ఇప్పటికే విడుదల చేసిన ఉస్తాద్‌ భగత్‌ సింగ్ ఫస్ట్‌ గ్లింప్స్ వీడియో నెట్టింట ట్రెండింగ్‌లో నిలుస్తోంది. గీతాసారాంశంలోని ఓ శ్లోకంతో షురూ అయిన ఉస్తాద్‌ భగత్‌ సింగ్ గ్లింప్స్‌ వీడియోలో ప‌వ‌ర్ స్టార్ పవన్ క‌ల్యాణ్ వెనక పిస్తోల్‌ పెట్టుకొని మాస్‌ ఎంట్రీ ఇంట్రీతో అదరగొట్టేస్తున్నాడు . భగత్‌.. భగత్‌ సింగ్‌ మహంకాళి పోలీస్‌స్టేషన్‌, పత్తర్‌ గంజ్‌, ఓల్డ్‌ సిటీ. ఈ సారి పర్ ఫార్మన్స్ బద్దలైపోద్ది.. అంటూ అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నాడు. హరీష్ శంకర్-పవన్‌ కల్యాణ్‌ కాంబోలో వచ్చిన గబ్బర్‌ సింగ్‌ను మించిపోయేలా.. డబుల్‌ మాస్ ట్రీట్‌ అందించేలా సినిమా ఉండబోతుందని గ్లింప్స్ వీడియోతో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్‌. హరీష్‌ శంకర్‌, పవన్‌ కల్యాణ్ కాంబోలో మరో ఊర మాస్‌ విజువల్ ట్రీట్ రాబోతుందని గ్లింప్స్ వీడియో చెబుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement