Sunday, April 28, 2024

ఎయిర్ పోర్ట్ లో ప్రియుడి తో నయన్

సౌత్ ప్రేక్షకులకు నయనతార గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ అమ్మడు డైరెక్టర్ విగ్నేష్ శివన్ డేటింగ్ లో ఉన్న సంగతి కూడా తెలిసిందే. ఇక ఈ ఇద్దరు కూడా ఇటీవల పెళ్లిళ్లు కూడా చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ఇటీవల నయనతార సోషల్ మీడియాలో ఓ ఉంగరాన్ని చూపిస్తూ ఫోటో పెట్టింది. ఆ ఫోటో చూసిన వారంతా కూడా వీరి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందని విషెస్ లు తెలిపారు.

అయితే ఈ జంట పెళ్లి కాకముందే విచ్చల విడిగ తిరుగుతూ కెమెరా కంటికి చాలాసార్లు చిక్కారు. ఇక తాజాగా నయనతార విగ్నేష్ తో కలిసి ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. ఈ నెల 14న కేరళలో విషు పండుగ సందర్భంగా నయన్ తన ప్రియుడితో కలిసి ఓ ప్రైవేట్ విమానంలో కొచి బయలు దేరి వెళ్లారు.

https://www.instagram.com/p/CNfU4ivBmoq/?igshid=vr2r4k5pnrhi

Advertisement

తాజా వార్తలు

Advertisement