Sunday, May 5, 2024

విశ్వక్‌ సేన్ 11 వ సినిమాకి.. దిల్ రాజు క్లాప్

హీరో విశ్వ‌క్ సేన్ త‌న 11వ సినిమాని ప్ర‌క‌టించాడు.ఈ చిత్రాన్ని కృష్ణ చైతన్య తెర‌కెక్కించ‌నున్నాడు. కాగా తాజాగా ఈ ప్రాజెక్ట్‌ అప్‌డేట్ ఇచ్చేశారువిశ్వక్‌సేన్‌. VS 11 పూజాకార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంఛ్‌ అయింది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత దిల్‌ రాజు క్లాప్ కొట్టారు.ప్రొడక్షన్‌ నంబర్ 12గా వస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మే రెండో వారంలో షురూ కానుంది. ఈ మూవీలో హీరోయిన్ అంజలి ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. ఈ చిత్రంలో విశ్వక్‌ సేన్ పొట్టి హెయిర్‌తో, కోరమీసంతో కనిపించబోతున్నట్టు తాజా ఫొటోలతో అర్థమవుతోంది. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నట్టు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement