Thursday, May 2, 2024

ప్రమాదంపై స్పందించిన నిఖిల్… అందరికీ ధన్యవాదాలు

కార్తికేయ 2 సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో యంగ్ హీరో నిఖిల్ గాయపడిన సంగతి తెలిసిందే. గుజరాత్ లో యాక్షన్ సన్నివేశాలకు సంబంధించి షూట్ చేస్తున్న సమయంలో నీ కాలికి గాయం అయింది. అయితే తనకు జరిగిన ప్రమాదంపై నిఖిల్ స్పందించాడు. తన కోసం ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు. తాను వేగంగా కోలుకుంటున్నాని,తన కోసం చాలామంది ఫోన్లు చేస్తున్నారని ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారని, మరికొందరు మెసేజ్ లు కూడా చేస్తున్నారని నిఖిల్ చెప్పుకొచ్చారు.

పూర్తిగా కోలుకుని రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వస్తానని, ఓ ఫోటోని పోస్ట్ చేశాడు. ఆ ఫోటో లో హ్యాండ్ స్టిక్ పట్టుకొని కనిపించాడు. చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. మరోవైపు బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.

https://www.instagram.com/p/CMSFaViDQHc/?igshid=1izjh3ynt37ne

Advertisement

తాజా వార్తలు

Advertisement