Tuesday, May 7, 2024

ఎవ‌రికెంత ప‌ట్ట’‌భ‌ద్రం’

ఆంధ్రప్రభ దినపత్రిక ప్రత్యేక కథనం..

పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రతి ఓటరును వ్యక్తిగతంగా చేరుకోవడం రాజకీయ పార్టీలకు సాధ్యం కాదు. ఈ క్రమంలో వీలైనంత సమావేశాలు నిర్వహించి తమ వాణి వినిపిస్తూనే డిజిటల్‌ ప్రచారాన్ని పార్టీలు ఆశ్రయించాయి. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ట్విట్టర్‌ ద్వారా వీడియోలు, ఇమేజ్‌లు, నినాదాలు పోస్ట్‌ చేస్తూ విస్తృతంగా జనంలోకి వెళ్ళాయి. వాయిస్‌ కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ప్రతిరోజూ ఓటరుకు టచ్‌లోకి వెళుతున్నారు. వినూత్న వీడియోలు, ప్రసంగాలతో ఆకట్టుకుంటున్నారు. ఫేస్‌బుక్‌ లైవ్‌ల ద్వారా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు…

హైదరాబాద్‌, : రెండు ఎమ్మెల్సీలు.. ఆరు ఉమ్మడి జిల్లాలు.. 77 అసెంబ్లిd నియోజకవర్గాలు.. 164 మంది అభ్యర్థులు 10.35 లక్షల మంది గ్రాడ్యుయేట్‌ ఓటర్లు.. ఎన్నడూలేని రీతిలో హోరెత్తిన ప్రచారానికి శుక్రవారంతో తెరపడ నుంది. ఆదివారం పోలింగ్‌ జరగ నుంది. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్ని కల తర్వాత జరుగుతున్న ఎన్నికలను అటు టీఆర్‌ఎస్‌, ఇటు బీజేపీ ప్రతిష్టాత్మ కంగా తీసుకోగా.. కాంగ్రెస్‌, స్వతంత్రులు, తెలంగాణ ఉద్యమనేతలు హోరాహోరీగా తలపడుతున్నారు. రెండింటిలో ఒకటి టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ స్థానం కాగా, మరొకటి బీజేపీ సిట్టింగ్‌ స్థానం. రెండు పార్టీలు సిట్టింగ్‌ నిలుపుకోవాలని, బోనస్‌ గెలుచుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలిస్తే.. వెంటనే జరిగే నాగార్జునసాగర్‌, కార్పోరేషన్‌ ఎన్నిక ల్లోనూ ఇదే ఊపుతో విజయం సాధించే ఉత్సాహాన్ని ప్రోది
చేసుకుంటుంది. రానున్న రెండున్నరేళ్ళ పదవీ కాలం ఎప్పటి లానే.. ఎలాం టి సవాళ్ళు లేకుండా నల్లే రుపై నడకలా ప్రయాణిస్తుంది. పార్టీ శ్రేణుల్లో విశ్వాసం కొనసాగు తుంది. తేడా వస్తే.. ఇంటా, బయటా చికాకులు తప్పవని రాజ కీయ విశ్లేషకులు చెబుతున్నారు. అనూహ్యంగా టీఆర్‌ఎస్‌ వ్యతిరేక వర్గాలను గుర్తించి.. చల్లబరచడంలో సక్సెస్‌ అయిన వాతావరణం ఉందని విశ్లేషిస్తున్నారు. ఇక భాజపాకు కూడా ఇది జీవన్మరణ సమస్య. దుబ్బాకలో సంచలన విజయం సాధించి, గ్రేటర్‌ హైదరాబాద్‌లో అనూహ్యంగా మెరుగుపడ్డ బీజేపీ.. తర్వాత ఆ టెంపో కొనసాగించడంలో కొంత తడబాటుకు గురైనట్లు కనబడుతోందని విశ్లేషకులు అంటున్నారు. ఈ ఎన్నికల్లో బోనస్‌ సాధించకున్నా.. సిట్టింగ్‌ గెలిచినా బీజేపీ హవాకు తిరుగుండదని, త్వరలో జరగబోయే నాగా ర్జునసాగర్‌ ఎన్నికల్లోనూ బలమైన ప్రభావం చూపవచ్చన్న విశ్లేషణలు సాగుతున్నాయి. టీఆర్‌ ఎస్‌కు ఉద్యోగులు, పట్టభద్రులు, యువత వ్యతిరేకంగా.. ఉన్నారని ముందునుండీ విపక్షాలు ప్రచారం చేస్తుండగా, ఈ సెక్షన్‌లో కొట్టగలిగితే ఇక విపక్షాల నోళ్ళన్నీ మూతపడుతాయని టీఆర్‌ఎస్‌ వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంపై ఈ పట్టభద్ర ఎన్నికలు ఖచ్చితమైన ప్రభావం చూపబోతున్నాయి.
పట్టణాలన్నీ చుట్టేసి..
టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి మొత్తం నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం మూడు జిల్లా ల్లోని 34 నియోజకవర్గాల్లోనూ సమావేశాలు నిర్వహించి, ఓటర్లను కలిసి అభ్యర్థించగా.. ఇతర పార్టీలు అభ్యర్థులు అన్ని ప్రాంతాలకు వెళ్ళలేకపోయినా.. వీలైనంత ప్రచారం చేశారు. ఇక్కడ టీజేఎస్‌ నేత ప్రొఫెసర్‌ కోదండరాం, బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి, యువతెలంగాణ పార్టీ అభ్యర్థి రాణిరుద్రమ, స్వతంత్ర అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న, కాంగ్రెస్‌ అభ్యర్థి రాములు నాయక్‌లు ప్రధాన రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మహ బూబ్‌నగర్‌కు సంబంధించి బీజేపీ సిట్టింగ్‌ అభ్యర్థి రామచందర్‌రావు గట్టి పోటీని ఎదుర్కొం టున్నారు. టీఆర్‌ఎస్‌ తొలిసారి ఈ నియోజకవర్గంపై గులాబీజెండా ఎగరేస్తామని చెబుతోంది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె వాణీదేవిని బరిలోకి దింపగా, సీఎం కేసీఆర్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. మంత్రులు, నేతలను మోహరించారు. ఇక్కడ గతంలో ప్రాతినిధ్యం వహించిన మాజీ ఎమ్మెల్సీ స్వతంత్రునిగా బరిలో నిలవగా, కాంగ్రెస్‌ పార్టీ మాజీ మంత్రి చిన్నారెడ్డిని పోటీలో నిలిపింది. చతుర్ముఖ పోరు రసవత్తరంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement