Friday, April 19, 2024

క‌మాండ‌ర్ స్టాలిన్ ఏడు ప్ర‌తిజ్ఞ‌లు..

ఆంధ్ర‌ప్ర‌భ దిన‌ప‌త్రిక ప్ర‌త్యేక క‌థ‌నం…
షేకఅవుతున్న ట్విట్టర్‌
విపరీతంగా ట్రెండింగ్‌
రాష్ట్రం మరింత సుసంపన్నం
దిగుబడులను పెంచుతాం
మెరుగైన జీవన విధానం
ఉచితంగా రక్షిత మంచినీరు
ఉన్నత విద్య, వైద్యం ఉచితం
అందమైన నగరాల రాష్ట్రం చేస్తాం
గ్రామీణాన్ని పునర్నిర్మిస్తాం
జాతీయ స్థాయిలో చర్చ
ఒకవైపు మద్దతు… మరోవైపు విమర్శలు

చెన్నై, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి – ఏప్రిల్‌ 6న తమిళనాడు అసెంబ్లి కి ఒకే రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు కూటములు కట్టాయి. డీఎంకే, ఏఐఏడీఎంకేలు కూటముల సభ్యు లకు సీట్ల పంపకాలు కూడా పూర్తిచేశాయి. డీఎంకే అధినాయకుడు స్టాలిన్‌ ప్రచారం కూడా మొదలెట్టారు. ఆయనతో పాటు మిగిలిన పార్టీలు కూడా ప్రచారంలో దూసు కుపోతున్నాయి. అయితే తాజాగా స్టాలిన్‌ ప్రకటించిన ఏడు ప్రతిజ్ఞలు తమిళనాడు వ్యాప్తంగా సంచలనంగా మారాయి. గురు వారం వీటిపై ట్విట్టర్‌లో విపరీతమైన ట్రెండింగ్‌ జరిగింది. ఇది ట్విట్టర్‌ను కూడా షేక్‌ చేసింది. లక్షలాదిమంది స్టాలిన్‌ ఏడు ప్రతిజ్ఞలు హ్యాష్‌టాగ్‌తో వీటిపై తమ అభిప్రా యాలను పంచుకున్నారు. మూడ్రోజుల క్రితం తిరుచురాపల్లి బహిరంగ సభలో రానున్న పదేళ్ళ తమిళనాడు భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని తాము అధికారంలో కొస్తే చేపట్టే చర్యల్ని స్టాలిన్‌ వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఆయన ఏడు అంశాల్లో తమ విధానాల్ని ప్రకటించారు. గత రెండ్రోజులు దీనిపై పెద్దగా స్పందన రాలేదు. కానీ గురువారం అకస్మాత్తుగా దీనిపై ట్రెండింగ్‌ మొదలైంది. తామధికారంలోకొస్తే సంపన్న తమిళనాడును మరింత సుసంపన్నం చేస్తామని స్టాలిన్‌ ప్రకటించారు. అలాగే దిగుబడుల్ని పెంచుతామన్నారు. పౌరులకు సంతోషకరమైన జీవన విధానాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. అలాగే పౌరులందరికీ ఉచితంగా రక్షిత మంచినీటిని అందుబాటులో పెడతామన్నారు. ఉన్నత విద్య, ఉన్నత స్థాయి వైద్యాన్ని ఉచితంగా కల్పిస్తామన్నారు. అందరికీ అవసరమైన ఔషధాల్ని ప్రభుత్వమే సరఫరా చేస్తుందన్నారు. తమిళనాడును అందమైన నగరాల రాష్ట్రంగా మారుస్తామన్నారు. గ్రామీ ణాన్ని పునర్‌నిర్మిస్తామన్నారు. గ్రామీణ ప్రజల జీవన ప్రమా ణాల్ని పెంచుతామన్నారు. దీన్నొక దాస్యనిక ప్రాజెక్ట్‌గా ఆయన పేర్కొన్నారు.
దీనిపై ట్విట్టర్‌ వినియోగదార్లు గురువారం ఉదయం నుంచి విపరీతంగా ట్రోలింగ్‌ చేస్తున్నారు. డీఎంకే ఐటీ బృందం గురువారం స్టాలిన్‌ యొక్క ఏడు ప్రతిజ్ఞలు అనే హ్యాష్‌ట్యాగ్‌ను రూపొందించింది. దీంతో దీనిపై జాతీయ స్థాయిలో చర్చ మొదలైంది. స్టాలిన్‌ ప్రణాళికను పలువురు స్వాగతించారు. కొందరు విమర్శించారు. ఈ ఏడు ప్రతిజ్ఞల్ని అద్భుతమైనవిగా కొందరు ప్రస్తుతించారు. పదేళ్ళలో తమిళనాడును మంచి రాష్ట్రంగా మార్చగలరన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. విద్య మనిషిలో మార్పు తెస్తుంది. ప్రజలందరికి సమాన విద్యావ కాశాలు అందుబాటులో ఉంచితే ఉత్తమ సమాజం రూపు దిద్దుకుంటుందంటూ కొందరు పేర్కొన్నారు. అలాగే విద్యాభి వృద్ధి వల్ల అన్ని ప్రాంతాలు సమంగా అభివృద్ధి చెందుతాయ న్నారు. దేశ రాజ్యాంగం అందరికీ సమానహక్కులు ఇచ్చింది. కానీ గత పదేళ్ళుగా తమిళనాడులో బానిస పాలన ఎదుర్కొంటున్నాం .. ప్రతీది తలక్రిందులుగా ఉంది.. ఇప్పుడు కమాండర్‌ తెరపైకొచ్చాడు.. తమిళనాడు ప్రజలకిచ్చిన ఏడు వాగ్ధానాల్ని నెరవేరుస్తాడంటూ మరికొందరు తమ ఆమో దాన్ని తెలిపారు.
రైతులు భారతదేశానికి వెన్నెముక. కానీ తనను తాను రైతుగా ముద్రేసుకున్న ముఖ్యమంత్రి పళనిస్వామి వాస్తవానికి రైతుల కోసం చేసిందేం లేదు. కానీ స్టాలిన్‌ రైతుల పాలిట దేవుడు. నీటి నిర్వహణ, యువత అభివృద్ధి, కనీస మద్దతు ధర అమలుకు ముఖ్యమైన ప్రణాళికల్ని తన ప్రతిజ్ఞల్లో ప్రకటించారంటూ ఇంకొందరు పేర్కొన్నారు.
అయితే స్టాలిన్‌కు సంబంధించి నెగిటీవ్‌ ట్రోలింగ్స్‌ కూడా ఎక్కువగానే వెలువడుతున్నాయి. ప్రతిదాన్ని ఎన్నికల వాగ్ధానంగా పేర్కోవచ్చు. వాటిని అమలు చేయాలంటే అధికారంలోకి రావాలి. వరుసగా మూడోసారి కూడా డీఎంకే అధికారాన్ని కోల్పోబోతోందంటూ ఇంకొందరు తమ అభిప్రాయాల్ని వెల్లడించారు.
మునుపటి కాలంలో ఇచ్చిన వాగ్దానాలన్నింటిని నెరవే ర్చారా అంటూ ఇంకొందరు నిలదీశారు. డీఎంకే అధికారం లోకొస్తే ప్రతిజ్ఞల మాటెలా ఉన్నా తిరిగి అరాచకం, వాక్చా తుర్యం పెరుగుతాయి. ఇది ప్రజల్ని ఆకర్షించే ప్రకటనే తప్ప వాస్తవ దృక్పథంతో రూపొందించింది కాదంటూ ఇంకొందరు మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement