Friday, April 26, 2024

కార్తి తాజా చిత్రం విరుమాన్ – ఊర‌మాస్ లుక్ తో పోస్ట‌ర్

త‌మిళ హీరో కార్తి న‌టిస్తోన్న తాజా చిత్రం విరుమాన్. ఈ చిత్రాన్ని కార్తి అన్న , త‌మిళ స్టార్ హీరో సూర్య త‌న సొంత బ్యాన‌ర్ పై నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని ముత్త‌య్య డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో కార్తి మాస్ లుక్ తో క‌నిపించ‌నున్నాడు. ఈ మేర‌కు కార్తి ఫ‌స్ట్ లుక్ ని చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. లుంగీ పైకి కట్టి .. బల్లెం వంటి ఆయుధాన్ని ధరించి .. అన్నిటికీ తెగించినవాడిలా ఒక రాళ్లగుట్టపై కూర్చుని ఈ పోస్ట‌ర్ లో ఆయన కనిపిస్తున్నాడు. ఆయన లుక్ చూస్తుంటేనే ఈ సినిమాలో యాక్షన్ తో కూడిన ఎమోషన్ పాళ్లు ఎక్కువేననే విషయం అర్థమవుతోంది. ఈ సినిమాతో హీరోయిన్ అదితి శంకర్ పరిచయమవుతోంది. డైరెక్టర్ శంకర్ కూతురే ఈ అమ్మాయి. ఈ సినిమాతోనే ఆమె తమిళ తెరకి పరిచయమవుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement