Friday, May 17, 2024

HBD – గేమ్ ఛేంజ‌ర్ సెట్ లో శంక‌ర్ జ‌న్మ‌దిన వేడుక‌లు ..

భారీ చిత్రాల దర్శకుడు ఎస్.శంకర్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు, నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. శంకర్ తెరకెక్కిస్తున్న ‘గేమ్‌ ఛేంజర్’ సినిమా సెట్‌లో ఆయన పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, నిర్మాత దిల్‌ రాజు తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. శంకర్‌‌కు కేక్‌ తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

‘రోబో 2.0’ తర్వాత ‘గేమ్‌ ఛేంజర్’, ‘ఇండియన్ 2’ చిత్రాలకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ చరణ్‌ హీరోగా తెరకెక్కిస్తున్న గేమ్‌ ఛేంజర్‌‌.. ఓ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్. ఈ మూవీలో కియారా అద్వానీ, శ్రీకాంత్, అంజలి, ఎస్‌జే సూర్య, సునీల్, నవీన్ చంద్ర, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement