Thursday, May 2, 2024

సుధీర్ బాబు పాన్ ఇండియా మూవీ..

సుధీర్‌ బాబు నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘హరోం హర’. ‘సెహరి’ సినిమా ఫేమ్‌ జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వంలో సుమంత్‌ జి నాయుడు నిర్మిస్తున్నారు. ”ది రివోల్ట్‌ ” అనేది సినిమా ట్యాగ్‌లైన్‌. ఫస్ట్‌ ట్రిగ్గర్‌ వీడియోను విడుదల చేశారు.
రేడియోలో వాతావరణ రిపోర్ట్‌తో వీడియో ప్రారంభమవు తుంది. కొంతమంది వ్యక్తులు తమ చేతుల్లో ఆయుధాలతో వస్తా రు. ముఖం కనిపించనప్పటికీ సుధీర్‌ బాబు కుర్చీలో కూర్చుని చేతిలో తుపాకీ పట్టు-కుని కనిపిస్తా రు. చివరగా అతని తుపాకీ నుండి ఫస్ట్‌ ట్రిగ్గర్‌ విడుదలవుతుంది. ”అందరు పవర్‌ కోసం గన్‌ పట్టు-కుంటారు… కానీ ఇది యాడాడో తిరిగి నన్ను పట్టు-కుంది… ఇది నాకేమో సెప్తావుంది…”అని సుధీ ర్‌ బాబు కుప్పం యాసలో అదరగొట్టాడు. మాండలికం, అతని వాయిస్‌ బేస్‌ పాత్రకు ఇం-టె-న్స్‌ తెస్తుంది. సుధీర్‌ బాబు సినిమా కోసం పూర్తిగా మేక్‌ఓవర్‌ అయ్యారు. ఫస్ట్‌ ట్రిగ్గర్‌ యాక్షన్‌ తో నిండివుంది. సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ‘హరోం హర’ చిత్ర కథ 1989లో చిత్తూరు జిల్లా కుప్పంలో జరుగుతుంది. ఈ ఏడాది డిసెంబర్‌ 22న హరోం హర ను విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement