Saturday, May 4, 2024

నిఖిల్ పుట్టిన‌రోజు – కార్తికేయ‌2 ఫ‌స్ట్ మోష‌న్ పోస్ట‌ర్

కార్తికేయ చిత్రానికి సీక్వెల్ తెర‌కెక్కుతోంది కార్తికేయ‌2. కాగా నేడు యంగ్ హీరో నిఖిల్ పుట్టిన రోజు సంద‌ర్భంగా కార్తికేయ‌2 నుంచి స‌ర్ ప్రైజ్ ఇచ్చారు మేక‌ర్స్..కార్తీకేయ-2’ చిత్రం నుంచి ఫస్ట్ మోషన్ పోస్టర్ వీడియో రిలీజ్ చేశారు. పాన్ ఇండియా ఫిల్మ్ గా ఈ పిక్చర్ తెరకెక్కుతుండగా, అన్ని భాషల్లో వీడియో విడుదల చేశారు. సముద్రం దాచుకున్న అతిపెద్ద ప్రపంచ రహస్యం ఈ ద్వారకా నగరం..అని నిఖిల్ ఇంటెన్స్ గా చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.సముద్రంలో రక్షకుల మాదిరిగా అలా షిప్ లో నిఖిల్, అనుపమా పరమేశ్వరన్, శ్రీనివాస్ రెడ్డి నిలబడి ఉన్న సీన్ వీడియోలో వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంది. బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేసిన ఈ ఫిల్మ్ జూలై 22న విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement