Tuesday, May 21, 2024

OTT Partner | హనుమాన్ ఓటీటీ హక్కులను దక్కించుకున్న ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ !

భారీ అంచనాల మధ్య ఇవ్వాల థియేటర్లోకి వచ్చిన హనుమాన్‌ మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ప్రీమియర్‌ షోల నుంచే పాజిటివ్ టాక్ వ‌చ్చింది. ఇదిలా ఉంటే ఇప్పుడు హనుమాన్‌కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. థియేటర్లో సందడి చేస్తున్న ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ చర్చనీయాంశంగా మారాయి. భారీ హిట్‌ కొట్టిన ఈసినిమా డిజిటల్‌ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ జీ5 సొంతం చేసుకుంది.

ఇక మూవీ పాన్ ఇండియా స్థాయిలో 11 భాషల్లో తెరకెక్కడంతో దానికి తగినట్లుగానే ఓటీటీ హక్కులు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. హనుమాన్ సినిమాను జీ5 సంస్థ మొత్తంగా రూ. 16 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అందులో హనుమాన్ తెలుగు వెర్షన్‌కు రూ. 11 కోట్లు, హిందీ వెర్షన్‌కు రూ. 5 కోట్లు వెచ్చించినట్లు టాక్.

ఇదిలా ఉంటే హనుమాన్‌కు సీక్వెల్‌ ఉండనుందని ఇప్పటికే మూవీ టీం క్లారిటీ ఇచ్చింది. మూవీ ఎండింగ్‌లో సీక్వెల్ టిల్‌ను కూడా రివీల్‌ చేశారు. ఈ మూవీ సీక్వెల్‌కు ‘జై హనుమాన్’ టైటిల్ ఖరారు చేశారు. వచ్చే ఏడాది 2025లో సినిమాను విడుదల చేస్తామని కూడా స్పష్టం చేశారు.

ఈ సినిమాలో తేజ సజ్జ సరసన అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. వీళ్లిద్దరూ జంటగా నటించిన తొలి చిత్రమిది. ఇందులో తేజ సజ్జ సోదరిగా వరలక్ష్మీ శరత్ కుమార్ నటించగా.. వినయ్ రాయ్ విలన్ రోల్లో అలరించాడు. ఇతర కీలక పాత్రల్లో రాజ్ దీపక్ శెట్టి, గెటప్ శ్రీను, సత్య, జబర్దస్త్ రోహిణి, రాకేష్ మాస్టర్ కనిపించారు. దర్శక నటుడు సముద్రఖని విభీషణుడి పాత్ర పోషించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement