Wednesday, May 8, 2024

హన్సిక మహా…టీజర్ వచ్చేస్తుంది!!

హీరోయిన్ హన్సిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా ఎన్నో సినిమాల్లో నటించింది హన్సిక. అయితే ప్రస్తుతం హన్సిక తన 50వ చిత్రం మహా లో నటిస్తుంది. రెండు సంవత్సరాలుగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రానికి యు ఆర్ జమీల్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. అయితే ఈ సినిమా కథను కూడా ఆయనే రాశారు. అయితే ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ చేస్తామా ఓటీటీ లో రిలీజ్ చేస్తామా అనే దానిపై చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నారు.

అయితే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను ముందుగా విడుదల చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారు. టీజర్ జూలై 2 న సాయంత్రం 6 గంటలకు విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇక ఈ సినిమాలో సనమ్ శెట్టి, తంబి రామయ్య, కరుణాకరణ్, శంకర్ కీలక పాత్రల్లో నటించారు. అలాగే ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement