Saturday, April 27, 2024

గుత్తా జ్వాల, విష్ణు విశాల్ పెళ్లి అయిపోయింది…ఫోటోలు వైరల్

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, తమిళ సినీ హీరో విష్ణు విశాల్ వివాహ జీవితాన్ని ప్రారంభించారు. గురువారం 01:40 కి వీరిద్దరి వివాహం జరిగింది. మొయినబాద్ లో అతి తక్కువమంది బంధుమిత్రుల సమక్షంలో ఈ వివాహం జరిగింది. సెప్టెంబర్ లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ఉగాది రోజు లగ్న పత్రిక ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇక కరోనా కారణంగా అందరికీ ఆహ్వానం పంపలేక పోతున్నామని అప్పుడే చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా ఈ ఇద్దరికీ ఇది రెండో వివాహం. 2010లో రజనీ నటరాజన్ ను పెళ్లి చేసుకున్న విష్ణు విశాల్ 2018 లో విడాకులు తీసుకున్నారు. ఇక 2005లో వివాహం చేసుకున్న గుత్తా జ్వాల 2011లో విడాకులు తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement