Friday, April 26, 2024

దసరా రేస్ లోకి పుష్ప ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఆర్య ఆర్య 2 చిత్రాలు ఘన విజయం సాధించడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. ఇదిలా ఉండగా కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో చాలా సినిమాలు రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే పుష్ప సినిమా రిలీజ్ డేట్ లో కూడా మార్పులు జరిగినట్లు తెలుస్తోంది.

మొదట ఈ సినిమా రిలీజ్ ను డిసెంబర్ కి షిఫ్ట్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ తాజా సమాచారం ప్రకారం దసరాకు అయితే బాగుంటుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. మరి అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి. ఒకవేళ పరిస్థితి సద్దుమణిగితే మాత్రం దసరాకి థియేటర్ లో పుష్ప సందడి పక్కాగా ఉంటుందట.

Advertisement

తాజా వార్తలు

Advertisement