Sunday, May 5, 2024

ఆచార్య నుంచి తొలి పాట విడుదల..

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ చిత్రం నుంచి తొలి పాట విడుదలైంది. లాహే లాహే..` అనే లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను ద‌ర్శ‌క నిర్మాత‌లు విడుద‌ల చేశారు. ఈ గీతానికి మణిశర్మ స్వరాలు కూర్చగా, రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు. హారిక నారాయణ్, సాహితి చాగంటి ఆలపించారు. ‘లాహే లాహే’ గీతం  ట్యూన్, సాహిత్యం ఇప్పుడొస్తున్న జానపద గీతాల ట్రెండ్ కు కాస్తంత దగ్గరగానే  ఉన్నాయి. ఈ పాట‌ను హైద‌రాబాద్ శివారు ప్రాంతమైన కోకాపేట‌లో వేసిన టెంపుల్ సెట్‌లో చిత్రీక‌రించారు. ఫోక్ సాంగ్‌.. సెమీ క్లాసిక్ ఫార్మేట్‌లో ఈ పాట ఆక‌ట్టుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవి, కాజ‌ల్ అగ‌ర్వాల్‌తో పాటు న‌టి సంగీత కూడా ఈ పాట‌లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. ఈ సినిమా మే 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతుంది. కాగా..ఈ సినిమా పోస్ట‌ర్స్, చిత్ర టీజ‌ర్ సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను రెట్టింపు చేశాయి.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement