Saturday, April 27, 2024

ఓటీటీలో రిలీజ్‌కు ఎఫ్‌3 రెడీ.. సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసిన మేక‌ర్స్‌!

ఎఫ్‌3 మూవీ ఓటీటీల్లో రిలీజ్ కావ‌డానికి రెడీగా ఉంది. దీనికి సంబంధించిన స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను సోనీలివ్ ద‌క్కించుకుంది. ఈ సినిమా జులై 22 నుండి స్ట్రీమింగ్‌ను కానున్న‌ట్టు తెలుస్తోంది. కాక‌పోతే దీనికి సంబంధించిన అఫీషియ‌ల్ అప్‌డేట్ వచ్చే అవకాశం ఉన్నందున డేట్ మారే చాన్సెస్ కూడా ఉండవచ్చు. థియేటర్ లో న‌వ్వులు పూయించిన ఈ సినిమా Ott ప్లాట్‌ఫారమ్‌లో ఎలాంటి అద్భుతాలు చేస్తుందో వేచి చూడాలి.

వెంక‌టేశ్, వ‌రుణ్ తేజ్ మ‌ల్టీస్టారర్ గా అల్టిమేట్ కామెడీ ఫిల్మ్ గా తెర‌కెక్కిన ఎఫ్ 2 కు సీక్వెల్ గా వచ్చిన సినిమా ఎఫ్ 3.
మే 27న థియేట‌ర్ల‌లోకి వచ్చిన ఎఫ్ 3 సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిగా.. దిల్ రాజు నిర్మించారు. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటించ‌గా ఓ స్పెషల్ సాంగ్ లొ అల‌రించింది న‌టి పూజా హెగ్దే. కాగా ఈ సినిమా AP/TS బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ మంచి విజయాన్ని సాధించినా.. బ్రేక్‌ఈవెన్ నంబర్‌లను సాధించడంలో విఫలమైందన్న టాక్ వ‌చ్చింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement