Friday, May 10, 2024

బింబిసార ట్రైల‌ర్ రిలీజ్‌.. నెక్ట్స్ లెవ‌ల్‌లో యాక్ష‌న్ సీన్స్‌

బింబిసార సినిమాకు సంబంధించిన ట్రైల‌ర్ ఇవ్వాల (సోమ‌వారం) కొద్దిసేప‌టి క్రిత‌మే రిలీజ్ అయ్యింది. ఈ ట్రైల‌ర్‌ని మేక‌ర్స్ అద్భుతంగా డిజైన్ చేశారు. దీనికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మ‌రింత ప్ల‌స్ అనే చెప్పాలి. హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌లు నందమూరి కళ్యాణ్ రామ్ ఇంతకు ముందెన్నడూ చూడని అవతార్‌లో ఈ సినిమాలో కనిపిస్తాడ‌ని ట్రైలర్‌ను బట్టి స్పష్టంగా తెలుస్తోంది.

ఈ సినిమాలో క‌ళ్యాణ్ రామ్ తోపాటు కేథరిన్ త్రెసా, సంయుక్త మీనన్, వరిన హుస్సేన్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, శ్రీనివాస రెడ్డి ముఖ్య‌మైన పాత్ర‌ల్లో కనిపించ‌నున్నారు. కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత కె.హరికృష్ణ ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం అందించగా ఛోటా కె.నాయుడు కెమెరా క్రాంక్ చేస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను సమకూర్చారు.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement